అమిత్ షా సాధుపుంగవుడేమీ కాదు: సాదినేని యామిని

0
129

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఘాటైన వ్యాఖ్యలు చేసి మల్లెపూల యామినిగా సోషల్ మీడియాలో బహుళ ప్రాచుర్యం పొందారు టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని. తన పదునైన.. చురుకైన మాటల తూటలతో విపక్షాలపై సెటైర్లు వేస్తూ రాజకీయవర్గాల్లోనూ యామిని తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా స్పందించే యామిని ఇప్పుడు జాతీయ రాజకీయాల మీదా తనదైన వ్యాఖ్యలు గుప్పించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ‘సాధుపుంగవుడేమీ’ కాదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల పై స్పంచించిన సమయం లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు గుజరాత్ లో అమిత్ షా హయాంలో ఎన్నో అల్లర్లు జరిగాయని, అమిత్ షా సాధుపుంగవుడని బీజేపీ భావిస్తుండటం చాలా దారుణమని ఆమె ఆ సందర్భంలో విమర్శలు చేశారు.