టీడీపీకి 80 శాతం మ‌హిళ‌ల ఓట్లు..? 96 నుంచి 130 సీట్లు..!

0
391

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మ‌హిళా ఓటు బ్యాంకు అంతా తెలుగుదేశం పార్టీకే ప‌డింద‌న్న‌ది టీడీపీ నేత‌ల అంచ‌నా. ఉద‌యం నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్‌లో భారీగా మ‌హిళ‌లు బారులు తీరార‌ని, గెలుపుకు అదే సంకేత‌మ‌ని వారు అంటున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్ర‌వేశ‌పెట్టిన ప‌సుపు – కుంకుమ స్కీమ్ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లింద‌ని, మ‌హిళ‌లు చాలా చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నార‌ని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

ఈవీఎంల మొరాయింపు కార‌ణంగా గంట‌ల త‌ర‌బ‌డి పోలింగ్ ఆగినా ఇళ్ల‌కు వెళ్లి.. మ‌ళ్లీ క్యూ లైన్‌ల‌లో నిల్చొని అర్ధ‌రాత్రి వ‌ర‌కు ప‌డిగాపులుకాచిమ‌రీ ఓట్లు వేసిన ప‌ద్ధ‌తి చూస్తుంటే మ‌హిళ‌ల త‌రుపున క‌చ్చితంగా టీడీపీకే సైలెంట్ వేవ్ ఉంద‌ని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు.

క్యూలైన్‌లో ఉన్న ప్ర‌తి మ‌హిళా టీడీపీ కోస‌మే నిలబ‌డ్డారా..? అంటే టీడీపీ నేత‌లు మాత్రం అవున‌నే స‌మాధానం చెబుతున్నారు. ప‌సుపు – కుంకుమ కార‌ణంగానే ప‌ట్టుద‌ల‌తో స‌హ‌నం కోల్పోకుండా ఉన్నార‌ని వారు అంటున్నారు. జ‌గ‌న్ కోసం అంత‌లా ఇబ్బందిప‌డే సీన్ లేదంటున్నారు.

పైగా జ‌గ‌న్ ప్ర‌క‌టించిన స్కీమ్‌లేవీ మ‌హిళ‌ల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేద‌ని మ‌హిళా ఓట్ల‌లో దాదాపు 80కు శాతంపైగా టీడీపీకే ప‌డ్డాయ‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. పోలింగ్ రోజున మ‌హిళ‌ల‌తోపాటు పోలింగ్ స్టేష‌న్‌కు వ‌చ్చిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో టీడీపీ విజ‌యం ఖాయ‌మ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.