హైకోర్టుకెక్కిన టీడీపీ

0
225

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్‌ విషయంపై టీడీపీ హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలుచేసింది. రామచంద్రాపురం మండలంలోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరపాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టుకు ఫిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలియజేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పిటిషనర్‌ ఫిర్యాదుపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఈసీని ఆదేశించింది.

ఈ సందర్భంగా ఈసీ తరఫున న్యాయవాది.. ఈ వ్యాజ్యం విచారించేందుకు హైకోర్టుకు అర్హతలేదని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, అర్హతపై పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. మరోవైపు, చిత్తూరు జిల్లా చంద్రగిరి లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో మే 19న రీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.