సీఈసీ నిర్ణ‌యంపై టీడీపీ అసంతృప్తి..!

0
91

చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఐదు చోట్ల మ‌ళ్లీ రీపోలింగ్ నిర్వ‌హిస్తామంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన నోటిఫికేష‌న్‌పై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీ పోలింగ్‌కు డిమాండ్ చేస్తూ ప‌త్రాలు స‌మ‌ర్పించిన రోజునే, తాము కూడా మ‌రికొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జ‌ర‌పాలంటూ కోరామ‌ని, అయితే ఈసీ మాత్రం కేవ‌లం వైసీపీ డిమాండ్ చేసిన ప్రాంతాల్లో మాత్ర‌మే రీపోలింగ్ జ‌రిగేలా నోటిఫికేష‌న్ జారీ చేసింద‌ని టీడీపీ మండిప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు ప్రాంతాల్లో మ‌ళ్లీ రీపోలింగ్ జ‌ర‌ప‌డంపై టీడీపీ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది.