టీడీపీ అసెంబ్లీ, ఎంపీ అభ్య‌ర్థుల జాబితా ఫైన‌ల్ : పంచెక‌ట్టులో తిరుప‌తికి చంద్ర‌బాబు..!

0
166
chandrababu election campaign
chandrababu naidu election campaign

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల స‌మ‌రానికి రెడీ అయ్యారు. అమ‌రావ‌తిలోని త‌న నివాసం వ‌ద్ద కొబ్బ‌రికాయ కొట్టిన సీఎం చంద్ర‌బాబుకు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి తిల‌కం దిద్ది హార‌తులు ప‌ట్టి ఎన్నిక‌ల ప్ర‌చారానికి సాగనంపారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబు ఎన్నిక‌ల శంఖారావాన్ని పూరించేందుకు సంప్ర‌దాయ దుస్తులు, పంచెక‌ట్టులో తిరుప‌తికి బ‌య‌ల్దేరారు. కుటుంబ స‌మేతంగా ఇవాళ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఎన్నిక‌ల బేరీని మోగించ‌నున్నారు.

కాగా, ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న త‌రునంలో సీఎం చంద్ర‌బాబు టీడీపీ త‌రుపున ఇప్ప‌టికే 126 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న 49 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు, 25 పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌కు సంబంధించి తుది జాబితాను తిరుప‌తి వేదిక‌గా నిర్వ‌హించనున్న టీడీపీ స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, శుక్ర‌వారం రాత్రే టీడీపీ అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసేందుకు క‌స‌ర‌త్తు జ‌రిగినా పూర్తి స్థాయిలో క్లారిటీ రాక‌పోవ‌డంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. దీంతో నేడు తిరుప‌తి స‌భ‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి సాక్షిగా సీఎం చంద్ర‌బాబు అభ్య‌ర్థుల ఫైన‌ల్ లిస్టుకు ఆమోద ముద్ర వేసే అవ‌కాశం ఉంది.