సీఎల్పీని విలీనం చేయాలంటూ లేఖ‌..!

0
92

టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన ప్ర‌క్రియ గంట గంట‌కూ మారుతోంది. మ‌రోప‌క్క టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌ను విలీనం చేయాల‌న్న సంక‌ల్పంతో ఎమ్మెల్యేలు ప‌నిచేస్తున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే టీఆర్ఎస్‌లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకుని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో 12 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆ త‌రువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలంద‌రికీ కేటీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత నేరుగా స్పీక‌ర్ కార్యాలయానికి వెళ్లి సీఎల్పీ విలీన లేఖ‌ను ఇవ్వ‌నున్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ త‌రుపున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఆల్రెడీ 12 మంది టీఆర్ఎస్‌లో చేరుతున్నామ‌ని ప్ర‌క‌టించ‌గా తాజాగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న శాస‌న స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. దాంతో కాంగ్రెస్ స‌భ్యుల సంఖ్య ఏడుకు ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో 18 మందిలో మూడువంతుల మంది అంటే 12 మంది టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయ్యేందుకు స్పీక‌ర్‌కు అందిస్తే చాలు.  ఆ త‌రువాతి తంతు స్పీక‌ర్ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉండ‌నుంది. అయితే, ఇప్ప‌టికే ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌తో క‌లిసి ప‌నిచేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా టీఆర్ఎస్‌లో చేరుతున్న‌ట్టు సిగ్న‌ల్స్ ఇచ్చారు.