చంద్రబాబును చూస్తుంటే నవ్వొస్తుంది : ఢిల్లీ పోయి ఏంజేస్తడు – తలసాని

0
62
చంద్రబాబు ను చూస్తుంటే నవ్వొస్తుంది : ఢిల్లీ పోయి ఏంజేస్తడు - తలసాని
చంద్రబాబు ను చూస్తుంటే నవ్వొస్తుంది : ఢిల్లీ పోయి ఏంజేస్తడు - తలసాని

చంద్రబాబు నాయుడును చూస్తుంటే నవ్వొస్తుంది ఢిల్లీ పోయి ఏంజేస్తడు, ఆయనకసలు సిగ్గులేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడినా ఆయన.. ఏదో 300 EVMలు మొరాయిస్తే కొంపలు మునిగిపోయాయి చంద్రబాబు బయపడుతున్నాడు. EVMలలో అలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మా తెలంగాణలో కూడా అలాంటి సమస్యలు వచ్చాయి.. కానీ ఎవరైనా లొల్లి చేస్తున్నారా ? ఒక చంద్రబాబు మాత్రమే ఏదో జరిగిపోయింది అని భయపడుతున్నాడు.

కారణం అతడు ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని స్పష్టంగా అర్దం అయ్యింది. అందుకే ఏం చేయాలో తెలియక ఎన్నికలకు ఒకరోజు ముందే “ఈసీ”ని కలిశాడు. పైగా పోలింగ్ సరిగ్గా జరగడం లేదు.. నా ఓటు నాకే పాడిందో లేదో అంటూ మీడియా ముందే చెబుతున్నాడు. ఇంత నీచంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా ? అయిన EVM మొరాయిస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డిల్లీకి వెళ్తాడా ? అక్కడికెళ్లి ఏంజేస్తాడు ? అంటూ చంద్రబాబు తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తలసాని.