తాడేప‌ల్లిగూడెం గ్రౌండ్ రిపోర్ట్ : ఆందోళ‌న‌లో బాపిరాజు వ‌ర్గం..!

0
187

ఇక తాడేప‌ల్లిగూడెంలోను తెలుగు త‌మ్ముళ్లు టెన్షన్ ప‌డుతున్నారు. ఇక్క కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉండ‌టంతో ఈలి నానికి టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. దీంతో తాడేప‌ల్లిగూడెం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ముళ్ల‌పూడి బాపిరాజు అల‌క‌పాన్పు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. టికెట్ కోసం ఆయ‌న చేసిన అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌లం కావ‌డంతో చివ‌రాఖ‌ర‌కు స‌ర్దుకుని ఈలి నానిని గెలిపించేందుకు ప‌నిచేశారు.

ఇదే స‌మ‌యంలో బాపిరాజుకు టికెట్ ల‌భిస్తుందేమోన‌న్న అభిప్రాయంతో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన తాడేప‌ల్లిగూడెం మున్సిప‌ల్ చైర్మ‌న్ శ్రీ‌నివాస్ జ‌న‌సేన‌లోకి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేశారు. మ‌రోప‌క్క ఈలి నాని గెలుపు బాధ్య‌త‌ల‌ను టీడీపీ అధిష్టానం బాపిరాజుకు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన వ్య‌క్తే జ‌న‌సేన నుంచి పోటీ చేస్తుండ‌టంతో బాపిరాజు వ‌ర్గం ఇప్పుడు ఆందోళ‌న‌కు గుర‌వుతోంది.