మహానగరంలో మళ్ళి స్వైన్ ఫ్లూ

0
211

మహానగరంలో మళ్ళి స్వైన్ ఫ్లూ బారిన పడుతున్నప్రజలు. చలి తీవ్రత వలనే ఎక్కువగా వ్యాపిస్తుందట.. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్  హాస్పిటల్లో మామూలుగానే రోజుకు 500 మంది రోగులు వస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో రోజుకు కనీసం 1000 మంది రోగులు జాయిన్ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఎందుకని అసలు విషయంలోకి వెళ్తే, తేలిన విషయమేమిటంటే స్వైన్ ఫ్లూ రోగులు ఎక్కువయ్యారట. జనవరి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 483 మంది రోగులు రాగ, వారందరి రక్తపరీక్షా నమూనాలో పరీక్షిస్తే,  83మంది స్వైన్ ఫ్లూ వ్యాధికి గురి అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.ఈ లెక్కన చూసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 83మందికి స్వైన్ ఫ్లూ సోకడం గూర్చి వివరణగా తెలుసుకుంటే, చలి తీవ్రత పెరగడంతో ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు చెప్పారు. కాబట్టి ప్రజలందరూ జాగ్త్రత పడాలని వైద్యనిపుణులు తెలిపారు.

వ్యాధి లక్షణాలు చూసుకుంటే :

ఈ వ్యాధి సోకిన వారికి విపరీతమైన జ్వరం, ఎక్కువగా దగ్గు రావడం, అలసటగ ఉండటం మరియు తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి… రు  కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించండి.