బిగ్ బ్రేకింగ్ : జ‌గ‌నే సీఎం.. స్వ‌రూపానందేంద్ర ఇచ్చిన సూచ‌న‌లివే..!

0
1053

మ‌రోసారి ఉత్త‌రాధికార మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించేందుకు శార‌దాపీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర స‌రస్వ‌తి సిద్ధ‌మ‌య్యారు. అయితే, స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుల‌న్న సంగ‌తి తెలిసిందే. స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ఉత్త‌రాధికార మ‌హోత్స‌వానికి వేదిక‌గా అమ‌రావ‌తిని ఎంచుకున్నారు.

అయితే, కేసీఆర్, జ‌గ‌న్ ఇద్ద‌రితో అత్యంత స‌న్నిహితంగా మెలిగే స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కాస్త దూరంగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ నేప‌థ్యంలోనే స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి త‌న పీఠానికి సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను విశాఖ మిన‌హా ఏ ప్రాంతంలోనూ నిర్వ‌హించేందుకు ఆస‌క్తి చూప‌లేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల వాద‌న‌.

ఆఖ‌ర‌కు మొన్న‌టికి మొన్న స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వతి నిర్వ‌హించిన రాజ‌శ్యామ‌ల యాగాలు కూడా విశాఖ కేంద్రంగానే జ‌రిపారు. ఒక‌వేళ బ‌య‌టి ఆహ్వానం మేర‌కు యాగాలు నిర్వ‌హించాల్సి వ‌స్తే అది ఒక్క హైద‌రాబాద్ కేంద్రంగా జ‌రిపేవారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాలంటూ హైద‌రాబాద్‌లో యాగం కూడా జ‌రిపారు.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో యాగం నిర్వ‌హించేందుకు స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి సిద్ధ‌మ‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కాబోతున్నాడంటూ అందిన స‌మాచారం మేర‌కేన‌ట‌. చంద్ర‌బాబుతో స‌న్నిహిత సంబంధాలు లేక‌పోయినా, మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాలతో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ అనుమ‌తితో అమ‌రావ‌తిలో యాగం నిర్వ‌హించేందుకు తాను సిద్ధ‌మైన‌ట్టు స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి తెలిపారు.