‘ సూర్యకాంతం’ రొమాంటిక్ వీడియో సాంగ్

0
238

“ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా.. పడినదాకా తెలియదే, ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా.. మనసు లోలోన నిలువదే ..” అంటూ హీరో తనలో కలిగిన ప్రేమను వ్యక్త పరుస్తూ, ఇవే భావాలూ నీలో ఉన్నాయంటూ పాటు కొనసాగుతుంది. చిలిపిగా, ప్రేమగా వారి మధ్య సాగే సన్నివేశాలతో ఉండే ఈ పాట సూర్యకాంతం సినిమాలోనిది. ప్రేమికుల రోజు సందర్బంగా ఈ సినిమాలోని లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.

నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం లో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాలో నిహారిక ప్రధాన పాత్ర పోషించగా, నిహారికకు జోడీగా స్టంట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. రాహుల్ విజయ్, మరో కథానాయిక తో కలిసి ప్రేమాయణంగా కొనసాగే లిరికల్ వీడియో సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేయాగ, రొమాంటిక్ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించి యూత్ ని ఆకట్టుకున్నారు. మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు.