పదిహేనేళ్లుగా ఆయన ఫోన్ కాల్ కోసం ఎదురు చూశా..! సూర్య

0
220
surya sensational comments selva raghavan

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమాలో హీరోయిన్ లుగా రకుల్, సాయి పల్లవి నటిస్తున్నారు. ఈ నెల 31 వ తేదీన విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లలో సూర్య నటనతో అద్భుతంగా మెప్పించాడు. సినిమా గూర్చి సూర్య మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

సూర్య దర్శకుడు సెల్వరాఘవన్ గూర్చి చెబుతూ.. “అసలు నేను ఇప్పటివరకు నాకు ఒక మూవీ చేయండి అని ఏ డైరెక్టర్ ని అడగలేదు. కానీ ఒక సారి 2002 లో సెల్వరాఘవన్ ను నాతో ఒక సినిమా చేయండి అని అడిగాను. అప్పుడు అయన అవకాశం వచ్చిన రోజు గ్యారంటీ గా చేద్దాం .. అని అన్నారు. ఇక అప్పటి నుంచి రాఘవన్ ఫోన్ కాల్ కోసం ఎదురు చూశాను. కానీ ఆయన నుంచి కాల్ రాలేదు. గత ఏడాది ఎన్జీకే కి చేద్దాం అని కాల్ చేశారు. నా కల నెరవేరింది. సెల్వరాఘవన్ సెట్ లోకి అడుగు పెట్టగానే సినిమా ప్రపంచమే తప్ప ఇంకేమి కనిపించదు. అలాంటి డైరెక్టర్ తో చేయడం నాకు చాలా అనడం గా ఉంది ” అని చెప్పుకొచ్చారు.