ఎల‌క్ష‌న్స్ 2019 : స‌తీమ‌ణితో క‌లిసి ఓటేసిన‌ హీరో సూర్య‌..!

0
160

దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండోద‌శ పోలింగ్ ప్రశాంతంగా జ‌రుగుతోంది. ఈ రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. వాస్త‌వానికి రెండోద‌శ‌లో భాగంగా 97 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌ర‌గాల్సి ఉంది. త‌మిళ‌నాడులోని వేలూరు పార్ల‌మెంట్‌ నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌లు ర‌ద్ద‌వ‌డం,. త్రిపుర లోక్‌స‌భ స్థానం ఎన్నిక వాయిదా ప‌డ‌టంతో రెండు స్థానాలు త‌గ్గాయి. దీంతో 95 పార్ల‌మెంట్ స్థానాల‌కు నేడు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కాగా, కాసేప‌టి క్రిత‌మే కోలీవుడ్ హీరో సూర్య త‌న స‌తీమ‌ణి జ్యోతిక‌తో క‌లిసి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.