అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పు..!

0
298

అయోధ్య‌లోని రామ‌జ‌న్మ‌భూమి, బాబ్రీ మ‌సీదు భూ వివాదం కేసులో సుప్రీం కోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. అయోధ్య కేసును మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా ప‌రిష్క‌రించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందుకోసం ముగ్గురు స‌భ్యుల‌తో ప్యానెల్‌ను నియ‌మించింది. రిటైర్డ్ జ‌డ్జీ ఖ‌లీఫ్ ఉల్లా నేతృత్వంలో ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ ర‌విశంక‌ర్, సీనియ‌ర్ లాయ‌ర్‌, ద మీడియా ఛాంబ‌ర్ ఫౌండ‌ర్ శ్రీ‌రాం స‌భ్యులుగా ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.

అలాగే విచార‌ణ మొత్తం ఫైజాబాద్‌లో జ‌ర‌గాల‌ని ఆదేశించింది. ప్యానెల్ స‌భ్యులు తీసుకున్న నిర్ణ‌యాలు ఏ మాత్రం మీడియాకు పొక్క‌కుండా మ‌ధ్య‌వ‌ర్తిత్వం జ‌ర‌గాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ప్రారంభించి, ఎనిమిది వారాల్లోగా పూర్తిచేయాల‌ని ప్యానెల్‌ను కోర్టు ఆదేశించింది. మ‌ధ్య‌వ‌ర్తులు జ‌రిపే విచార‌ణ‌ను రికార్డు చేయాల‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది.