వర్మకు షాకిచ్చిన.. సుప్రీంకోర్ట్..!

0
481
ram gopal varma
ram gopal varma

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ ఎన్నో వివాదాల మధ్య విడుదలైనది. ఆంధ్రప్రదేశ్ లోమినహా..  ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందె. అయితే ఈ విషయం మీదే ఆర్జీవీ తరపున ఈరోజు ఏపీ హైకోర్టు ఆదేశాలకు స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా, అత్యవసరమైన విచారణను చేపట్టుటకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు.

సుప్రీం కోర్టు  చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషన్ డిస్మిస్ చేశారు. అంతే కాకుండా హైకోర్టు నిర్ణయాన్ని ఏప్రిల్ 3న తెలియ చేయనుంది కదా , అప్పటివరకు ఎందుకు వెయిట్ చేయరంటూ ప్రశ్నించారు. హైకోర్టు నిర్ణయం తీసుకునే సమయం వరకు వెయిట్ చేయాలి .. అక్కడ వ్యతిరేకమైన తీర్పు వచ్చినపుడు మాత్రమే సుప్రీం కోర్టు ను ఆశ్రయించాలని తెలియచేశారు.

ఇది ఇలా ఉంటె రాంగోపాల్ వర్మ బయోపిక్ గా మరో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఐరన్ లేడీ జయలలిత బయోపిక్ మొదలవుతున్నదని అందరికి తెలిసిందే. దివంగత జయలలిత నిచ్చెలి శశికళ జీవితాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.