దేశ ప్ర‌ముఖుల‌ను మ‌రోసారి బీట్ చేసిన స‌న్నీ..!

0
39

సన్నీలియోన్ మాయ నుంచి ఇండియన్ యూత్ ఇంకా బయట పడటం లేదు. సినిమాలు, వాటి రిజల్ట్‌తో సంబంధం లేకుండా సన్నీలియాన్ పేరును మాత్రం నెటిజ‌న్లు మహా మంత్రంగా జపిస్తున్నారు. ఈ మాయలతోనే మోస్ట్ గూగుల్ సెలబ్రెటీ అఫ్ ది ఇయర్ (2018)గా స‌న్నీ లియోణ్ మ‌రోసారి సూపర్ రికార్డ్‌ను అందుకుంది.

అయితే, సన్నీలియోన్‌ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. అంతే కాదు ఈ భామకు బాలీవుడ్‌లో కూడా సినిమా తగ్గిపోయాయి. స్పెషల్ సాంగ్స్ ఆఫ‌ర్లు కూడా పెద్దగా రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ కెరియర్ ఈ ఏడాది స్లోగానే న‌డిచింది. సినిమా అవకాశాలు తగ్గిపోయినా సన్నీలియోన్ పాపులారిటీ మాత్రం రోజు రోజుకు అమాంతం పెరుగుతోంది.

సన్నీలియోన్‌కు అఫర్‌లు రాకపోయినా వెండితెర మీద కనిపించక పోయినా కురాళ్లు మాత్రం సన్నీ నామజపం చేస్తున్నారు. ఈ బ్యూటీ కోసం గూగుల్‌లో తెగ‌ సెర్చ్ చేసేస్తున్నారు. దీంతో సన్నీలియోన్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలను, ప్రియాంక చోప్రా, దీపీకా పదుకొనె వంటి క్రేజీ హీరోయిన్ సైతం ప‌క్క‌న‌పెట్టేసి బ్రేక్ చేసేసింది.

అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రధాని మోడీని కూడా వెనకు నెట్టి ఈ ఏడాది మోస్ట్ ఇండియన్ సెలబ్రెటీగా నిలిచింది. ప్రియాంక చోప్రా, నెక్ జోనస్ పెళ్లి గురించి, రణవీర్ సింగ్ , దీపికా పదుకొనె డెష్టినేషన్ వెడ్డింగ్ గురించి ఈ ఏడాది నెట్ వర‌ల్డ్‌లో చాలా చర్చ లు జరిగాయి. అలాంటిది అసలు సినిమాలు లేని సన్నీలియాన్ గురించి ఎక్కువగా సర్చ్ చేశారు. అంటే స‌న్నీలియోణ్‌ ఫాలోయింగ్ ఏరేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి డిజిటల్ ఫ్లాట్‌లో సునామీ సృష్టిస్తున్న సన్నీ.. సిల్వర్ స్క్రీన్‌పై ఆరెంజ్‌లో ఎప్పుడు అదరగొడుతుందో చూడాలి.