TRSలో చేరిన మరో కాంగ్రెస్ నేత : మిగిలేది ఎవరు ?

0
134
TRSలో చేరిన మరో కాంగ్రెస్ నేత : మిగిలేది ఎవరు ?
TRSలో చేరిన మరో కాంగ్రెస్ నేత : మిగిలేది ఎవరు ?

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా నిన్నటివరకు TRS ప్రతిపక్షంగా కొంతలో కొంత ఉనికిని నిలుపుకున్న కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు పెరిగిపోతున్నాయి. దాంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి “సునీతా లక్ష్మారెడ్డి” సైతం TRSలో చేరారు. మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె.. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

అందులో బాగంగానే సోమవారం తెలంగాణ భవన్‌ లో కేటీఆర్‌, హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు “సునీతా లక్ష్మారెడ్డి”. నిజానికి ఈనెల మొదటి వారంలో నర్సాపూర్‌ లో జరిగే CM కేసీఆర్‌ సభ సందర్భంగా గులాబీ గూటికి చేరాల్సిఉంది. అయితే సమయం కంటే ముందే TRSలో చేరారు “సునీతా లక్ష్మారెడ్డి”.