ఫ‌టాఫ‌ట్ న్యూస్‌..!

0
190

→ టీడీపీ ఎంపీ కేశినేని, వైసీపీ నేత పీవీపీ మ‌ధ్య ట్వీట‌ర్ వార్ కొన‌సాగుతోంది. దొంగ‌లకు అంద‌రూ దొంగ‌ల్లానే క‌న‌ప‌డ‌తారంటూ కేశినాని పీవీపీని ఉద్దేశించి ట్వీట్ చేయ‌గా, నంబ‌ర్‌ప్లేట్లు మార్చి వ్యాపారం చేసినా ఫైనాన్షియ‌ర్ల‌కు డ‌బ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్‌ను మూసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటూ పీవీపీ ఎద్దేవ చేశారు.

→ చంద్ర‌గ్ర‌హ‌ణం ముగిసిన అనంత‌రం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ‌వారి ఆల‌యం త‌లుపుతు తెరుచుకున్నాయి. ఈ రోజు ఉద‌యం 4.30 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచిన అధికారులు భ‌క్తుల‌ను శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు.

→ స‌దావ‌ర్తి భూముల‌పై విచార‌ణ‌కు వైసీపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో స‌దావ‌ర్తి భూముల విక్ర‌యాల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడ‌తామ‌ని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి అన్నారు.

→ తెలంగాణ రైతుల‌కు టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేర‌కు రుణ‌మాఫీని వెంట‌నే ప్ర‌క‌టించాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేర‌కు బీజేపీ నేత‌లు సీఎస్‌ను క‌లిశారు. రుణ‌మాఫీకి సంబంధించిన నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి పంపితే సాయం చేస్తుంద‌ని వారు తెలిపారు.

→ వైసీపీ అరాచ‌కాల‌కు పాల్ప‌డుతుంద‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అన్నారు. త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.