సుజ‌నా చౌద‌రి : బీజేపీలో చేరిక‌పై ఫుల్ క్లారిటీ..!

0
385

ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తన రాజ‌కీయ‌కీయ గురువన్న విషయాన్ని టీడీపీ సీనియ‌ర్ నేత సుజ‌నా చౌద‌రి మరోసారి స్ప‌ష్టం చేశారు. ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబుపై త‌న ప్రేమ‌, అభిమానాలు జీవితాంతం అలానే ఉంటాయ‌ని సుజ‌నా చౌద‌రి చెప్పుకొచ్చారు.

ఇదే సంద‌ర్భంలో.., నాడు కేంద్ర‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో బీజేపీకి బాగా ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌య‌త్నం చేశారు క‌దా..! నేడు ఆ పార్టీలోకి చేరే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారా..? అంటూ ఇంట‌ర్వ్యూయ‌ర్ ప్ర‌శ్నించ‌గా అటువంటి అవ‌స‌రం ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని సుజ‌నా చౌద‌రి స‌మాధాన‌మిచ్చారు. అటువంటి విష‌యాలు ముందుగా త‌మ అధినాయ‌కుడికి చెప్పి, ఆ త‌రువాత ప్ర‌జ‌ల‌కు కూడా చెబుతానంటూ సుజ‌నా అన్నారు.