షాక్ : మైనార్టీలో రాష్ట్ర ప్ర‌భుత్వం..? ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు పెట్టాల‌ని లేఖ..!

0
189

ఆదివారం నాడు ప‌లు ప్ర‌ముఖ సంస్థ‌లు విడుద‌ల చేసిన ఎగ్జిట్‌పోల్స్ ఫ‌లితాల‌తో రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల కింద పీఠాలు క‌దిలిపోతున్నాయి. అత్తెసురు మెజార్టీతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అధికారం చెలాయిస్తున్న క‌మ‌ల‌నాథ్ స‌ర్కార్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ మైనార్టీలో ప‌డిపోయిందని, ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాలు పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ మ‌ధ్య‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాసింది. దీంతో కాంగ్రెస్ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే బీజేపీ లేఖ రాయ‌డం వెనుక ఆంత‌ర్య‌మేమిట‌న్న చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తున్న ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలను లాగేస్తారా..? లేక ఏకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌నే బీజేపీలో చేర్చుకుంటారా..? అన్న చ‌ర్చ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హీట్‌ను పెంచేస్తోంది. మొత్తం మీద ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందే భోపాల్‌లో హార్స్ ట్రేడింగ్ జ‌రుగుతుంద‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి.