ఎక్కువ వడ్డీ పొందడం ఎలా..? : SBIలో 5 బంఫర్ స్కీమ్స్

0
63
ఎక్కువ వడ్డీ పొందడం ఎలా..? : SBIలో 5 బంఫర్ స్కీమ్స్ ఇవే
ఎక్కువ వడ్డీ పొందడం ఎలా..? : SBIలో 5 బంఫర్ స్కీమ్స్ ఇవే

భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ డబ్బులు పొదుపు చేయాలి అనుకోవడం సహజమే. కానీ కొందరు మాత్రం అధిక వడ్డీకి ఆశపడి చిన్నా చితకా ప్రవేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు.. తీర సదురు సంస్థ బోర్డ్ తిప్పడంతో ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా కాకుండా ప్రభుత్వ బ్యాంకుల్లోనే అధిక వడ్డీ వచ్చే స్కీమ్స్ ఉన్నాయని చాలా మందికి తెలియదు. ప్రభుత్వ సంస్థ అయిన “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా”లో అనేక డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి పీపీఎఫ్ వరకు అనేక పథకాలున్నాయి. ఒక్కో స్కీమ్‌కు ఒక్కోలా వడ్డీ రేట్లు ఉంటాయి. పైగా ఎందులో ఇన్వెస్ట్ చేసినా రిస్క్ అనేదే ఉండదు. రిటర్న్స్ తక్కువైనా మీ డబ్బుకు ఢోకా ఉండదు. మీరు ఎంచుకునే స్కీమ్‌ను బట్టి 5.75 నుంచి 8.7 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. SBI వెబ్‌సైట్‌ లోని వివరాల ప్రకారం అధిక వడ్డీలు ఇస్తున్న ఆ పథకాలెంటో ఎప్పుడు తెలుసుకుందాం.

* రికరింగ్ డిపాజిట్ (RD) : నెలకు కొంత పొదుపు చేయాలనుకునేవారికి రికరింగ్ డిపాజిట్ సరైన ఆప్షన్. వడ్డీ కూడా లభిస్తుంది. మీరు నెలకు కనీసం రూ.100 కూడా పొదుపు చేసుకోవచ్చు. గరిష్టంగా ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. 12 నెలల నుంచి 120 నెలల వరకు ఆర్‌డీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫిక్స్‌ డిపాజిట్ అకౌంట్‌కు వచ్చే వడ్డీనే రికరింగ్ డిపాజిట్‌కు లభిస్తుంది.

* నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) : 18 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లు ఎవరైనా నేషనల్ పెన్షన్ స్కీమ్‌ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. రిటర్న్స్ మార్కెట్‌ పై ఆధారపడి ఉంటాయి.

* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) : ఎక్కువ వడ్డీ ఇచ్చే స్కీమ్ పీపీఎఫ్. ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50,000 వరకు SBI పీపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు దాచుకోవచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా నెలనెలా పొదుపు చేయొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ 8.0 శాతం ఉంది. వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

* ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) : ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో మీరు ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 నుండి 6.85 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక వృద్ధులకు అయితే 6.25 నుండి 7.35 వడ్డీ లభిస్తుంది.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) : వృద్ధులు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బుల్ని దాచుకోవడానికి ఉపయోగపడే స్కీమ్స్ ఇది. రూ.1,000 నుంచి రూ.15 లక్షల వరకు ఎంతైనా దాచుకోవచ్చు. వడ్డీ రేటు వార్షికంగా 8.7 శాతం లభిస్తుంది.