శృంగేరి మ‌ఠంలో రూ.18 ల‌క్ష‌ల విలువైన బంగారం మాయం..!

0
75

హైద‌రాబాద్ న‌ల్ల‌కుంట శృంగేరి మ‌ఠంలో దొంగ‌లు ప‌డ్డారు. రూ.18 ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని మాయం చేశారు. అయితే, దొంగ‌లంటే బ‌య‌టి దొంగ‌లు కాదు.., ఇంటి దొంగ‌లే. కాగా, కొన్ని వారాల క్రిత‌మే భక్తులు మొక్కుల రూపంలో స‌మ‌ర్పించుకునే న‌గ‌లు భ‌ద్ర‌ప‌రిచే గ‌ది నుంచి కొంత మొత్తం మాయ‌మైన‌ట్టుగా అధికారులు గుర్తించారు.

ఇద్ద‌రు క్ల‌ర్కుస్థాయి ఉద్యోగులు శ్రీ‌నివాస్‌, సాయిల‌ను తొల‌గించారు. అయితే, ఈ విష‌యం శృంగేరి పీఠాధిప‌తి భార‌త తీర్ధ‌స్వామి దృష్టికి వెళ్ల‌డంతో వారి ఆదేశాల మేర‌కు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఈ వ్య‌వ‌హారంలో సాయి అనే ఉద్యోగిని న‌ల్ల‌కుంట పోలీసులు విచారించిన‌ట్టుగా తెలుస్తుంది.