‘పటాస్’ షో కి బ్రేక్.. శ్రీముఖి..!

0
450
srimukhi giving break to pataas programme

బుల్లి తెర మీద సందడి చేసే యాంకర్ లలో అనసూయ, రష్మీ తర్వాత అంత క్రేజ్  కొట్టేసిన అమ్మడు శ్రీముఖి. పటాస్ కి ముందు ఎన్నో షోలు చేసినా.. ఈ షో తోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇన్ని డేస్ సక్సెస్ ఫుల్ గా పటాస్ షో జరగడానికి కారణాలు కూడా శ్రీముఖినే అనే వారు ఎక్కువే. పటాస్ స్టేజ్ మీద శ్రీముఖి చేసే అల్లరి అంతా.. ఇంతా కాదు. యూత్ ఫుల్ కంటెంట్ తో సాగే ఈ ప్రోగ్రామ్ ఎన్నో నవ్వుల పువ్వులను అందిస్తుంది.

శ్రీముఖి ఎనేర్జి, అందంతో స్టేజి కి కొత్త మెరుపు తీసుక వచ్చింది. కానీ శ్రీ ముఖి పటాస్ నుంచి బ్రేక్ తీసుకుంటుందట. ప్రొడక్షన్ హౌస్ పర్మిషన్ తోనే కొంత కాలం బ్రేక్ తీసుకుంటుందని ట్విట్టర్లో లో వీడియోని వదిలింది. ఎంతగానో ఆదరించిన పటాస్ అభిమానులకు తెలియ చేసే పరంగా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా తనను నమ్మి, పటాస్ షో ఇచ్చినందుకు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, శ్యామ్ , దీప్తి లకు థ్యాంక్స్ అంటూ తెలిపింది. పటాస్ అంటేనే శ్రీముఖి అని భావించిన అభిమానులు ఇక నుండి షో వంక చూస్తారో లేదో చూడాలి. కొంత మంది ఆర్టిస్ట్స్ పటాస్ నుంచి తప్పుకోవడం.. ఇదే సమయం లో శ్రీముఖి బ్రేక్ తీసుకోవడం మీద పలు అనుమానాలు కలుగుతున్నాయి.