హీరోగా తెరంగేట్రం చేస్తున్న శ్రీ హరి తనయుడు..!

0
336
srihari elder son meghamsh movie

రియల్ స్టార్ శ్రీహరి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా, ఎన్నో విభిన్నమైన పాత్రలను చేసి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. స్టంట్ మాస్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. తెలంగాణ యాస తో సందడి చేసి అందరి మన్ననలను పొందాడు. ఆయన స్వర్గీయులై ఐదేళ్లు దాటింది. సినీ పరిశ్రమలో శ్రీహరి లేని లోటు ఇప్పటికి తారసపడుతూనే ఉంది. ఆ లోటును పూడ్చేందుకు శ్రీహరి తనయుడు మేఘాంశ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు.

దివంగత శ్రీ హరి సినీ నటి డిస్కో శాంతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. 2013వ సంవత్సరం అక్టోబర్ నెలలో శ్రీహరి లోకం విడచి వెళ్లారు. వీరి పెద్ద కొడుకైన మేఘాంశ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపుదిద్దుకుంటున్న ‘రాజ్ దూత్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. కార్తిక్, అర్జున్ వీరిద్దరూ దర్శకులుగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్‌ పతాకం పై ఎంఎల్‌వీ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రీకరణ కొంత భాగం పూర్తయింది. మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.