శ్రీ‌దేవిది ప‌క్కా హ‌త్యే..!

0
155

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి స‌హ‌జ మ‌ర‌ణం కాదా..? ఆమెను హ‌త్య‌చేసి చ‌నిపోయిన‌ట్టు చిత్రీక‌రించారా..? అంటే అవున‌నే అంటున్నారు కేర‌ళ పోలీస్ బాస్. శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని, ఆయ‌న ఒక్క‌సారిగా బాంబ్‌పేల్చారు. ఆ విష‌యాన్ని త‌న స్నేహితుడు, ఫోరెన్‌సిక్ నిపుణుడు డా.ఉమద‌త్త‌న్ చెప్పిన‌ట్టు తెలిపాడు. కేర‌ళ కౌముది వార్తా ప‌త్రిక‌లో శ్రీ‌దేవిది స‌హ‌జ మ‌ర‌ణం కాదంటూ రిష్‌రాజ్‌సింగ్ రాసుకొచ్చారు. దీంతో శ్రీ‌దేవి మృతి అంశం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.

శ్రీ‌దేవి మృతికి సంబంధించి అనుమానం ఉంద‌ని త‌న మిత్రుడు, ఫోరెన్‌సిక్ ఎక్స్‌పెర్ట్ డా.ఉమ‌ద‌త్త‌న్ కూడా త‌న‌తో చెప్పిన‌ట్టు ఆ వార్తాప‌త్రిక‌లో రాయ‌డం ప్రాధాన్య‌త‌ను క‌ల్పించింది. ప్ర‌ముఖ న‌టి హ‌త్య విష‌యంలో పోలీసు అధికారే కాక ఫోరెన్‌సిక్ నిపుణుడికి కూడా అనుమానం రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీనినిబ‌ట్టి శ్రీ‌దేవిది స‌హ‌జ‌మ‌ర‌ణం కాద‌నే అవ‌కాశాలు ఉన్నాయి. శ్రీ‌దేవి చ‌నిపోయాక ఆతృత‌తో ఏం జ‌రిగింద‌ని అడిగితే స‌హ‌జ‌మ‌ర‌ణం కాద‌ని ఉమ‌ద‌త్త‌న్ చెప్పాడ‌ని గుర్తు చేశాడు కేర‌ళ డీజీపీ. అంతేకాకుండా శ్రీ‌దేవి బాత్‌ట‌బ్‌లోప‌డి ఎలా చ‌నిపోతార‌ని కొన్ని ప్ర‌శ్న‌ల‌ను కూడా సంధించారు. అయితే ఎక్కువ మ‌ద్యం సేవిస్తే మాత్రం అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.