భ‌ద్రాద్రిలో శ్రీ‌రామ‌చంద్రుని ప‌ట్టాభిషేకం నేడే

0
287

అఖిలాండకోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడైన శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి క‌ళ్యాణం అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఇవాళ శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం మ‌హోత్స‌వానికి అధికారులు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌తో విశ్వ‌సేవ పూజ‌తో శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం కార్య‌క్ర‌మం ప్రారంబ‌మ‌వుతుంది.

ల‌క్ష్మ‌ణ‌, హ‌నుమ స‌హిత సీతారాముల‌ను ప‌ట్టాభిషేక వేదిక‌పై నిలిపి మేళ తాళాల‌తో ప‌ట్టాభిషేకాన్ని వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేందుకు దేశ విదేశాల నుంచి భారీగా భ‌క్త‌జ‌నం హాజ‌ర‌వ‌డంతో భ‌ద్రాచ‌లం ప్రాముఖ్య‌త‌ను చాటుతుంది. మిథిలా స్టేడియంలో శ్రీ‌రామ ప‌ట్టాభిషేకం క‌న్నుల విందుగా సాగ‌నుంది. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తోపాటు అధికార‌, అన‌ధికారులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు.