క్రికెట‌ర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో టాప్ మోడ‌ల్‌..!

0
322

క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ – 2019 భాగంగా చెస్ట‌ర్ లీ స్ట్రీట్ రివ‌ర్‌సైడ్ అంత‌ర్జాతీయ స్టేడియంలో సోమ‌వారం జ‌రిగిన శ్రీ‌లంక – వెస్టిండీస్ మ్యాచ్ చివ‌రి నిముషం వ‌ర‌కు ఎంతో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీ‌లంక నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 338 ప‌రుగులు చేయ‌గా, భారీ విజ‌యల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ చివ‌ర‌కు పోరాడి 315 ప‌రుగుల వ‌ద్ద ఆలౌట్ అయింది. దీంతో శ్రీ‌లంక 23 ప‌రుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజ‌యం సాధించింది.

అంత‌కు ముందు శ్రీ‌లంక నిర్దేశించిన 338 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యాన్ని చేదించేప‌నిలో ఉన్న వెస్టిండీస్ ఆట‌గాళ్ల‌లో మ‌రింత ఉత్సాహాన్ని నింపేందుకు టాప్ మోడ‌ల్‌,  బార్బ‌డోస్ సూప‌ర్‌స్టార్ రిహానా స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చింది. త‌న‌దైన ప‌డుచు అందంతో ఆట‌గాళ్ల‌కు ఫ్ల‌యింగ్ కిస్‌లు ఇస్తూ, క‌మాన్ వెస్టిండీస్ అంటూ కేక‌లు వేస్తూ స్టేడియాన్ని ఓ ఊపు ఊపింది. అంత‌టితో ఆగ‌క డ్రెస్సింగ్ రూమ్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది. క్రీడాకారుల‌తో సెల్ఫీలు దిగుతూ ఆల్‌ద బెస్ట్ అంటూ షేకండ్ ఇస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేసింది.