శ్రీ‌లంక పేలుళ్లు : దారుణానికి ఒడిగ‌ట్టింది ఆ ఉగ్ర‌వాద సంస్థేనా..?

0
124

ఉగ్ర‌దాడితో శ్రీ‌లంక చిగురుటాకులా వ‌ణుకుతోంది. ఈస్ట‌ర్ పండుగ రోజున శ్రీ‌లంకలోని చ‌ర్చిలు విదేశీ ప‌ర్య‌ట‌కులు బ‌స‌చేసే హోటళ్లే టార్గెట్‌గా ఉగ్ర‌వాదులు జ‌రిపిన బాంబుదాడుల్లో 295 మంది మృత్యువాత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. సుమారు 500 మందికిపైగా బాధితులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎనిమిది మంది భార‌తీయులు ఉన్న‌ట్టు గుర్తించారు. అయితే, ఈ విధ్వంసం సృష్టించింది తామేనంటూ ఇంత వ‌ర‌కు ఎవ‌రూ ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ ఎన్‌టీఈ అనే ఉగ్ర‌వాద సంస్థే ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు శ్రీ‌లంక ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.