భర్త పై సంచల వ్యాఖ్యలు.. సౌందర్య రజినీకాంత్..!

0
92
rajinikanth daughter sondarya with her husband

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు పెళ్లి ఈ మధ్య జరిగిన విషయం అందరికి తెలిసిందే. సౌందర్య విశాఖన్‌ అనే అతనిని ఫిబ్రవరి 11వ తేదీన వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండొవ వివాహం. అయితే ఈ వివాహానికి తన తండ్రి తో పాటు , ముఖ్యంగా కొడుకు వేద్ పర్మిషన్ తీసుకుందట సౌందర్య. ఈ మధ్య తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన పెళ్లి ముచ్చట్లు పంచుకుంది రజనీ కుమార్తె.

సౌందర్య మాట్లాడుతూ.. “కొడుకు వేద్ కు విశాఖన్ ఫొటో చూపించి ‘ఇదిగో డ్యాడీ’ అని చెప్పాను. అంతే ఇక విశాఖన్ ని మొదటి సారి చూడగానే వేద్ కు చాలా బాగా నచ్చాడు. వేద్ ఎంతో ఆనందించాడు. ఇక మా పెళ్లి రోజు.. ముహూర్తం దగ్గర పడుతున్న సమయాన, ఇంట్లో వాళ్ళు ఇంకా వేద్ ని మండపానికి తీసుక రాలేదు. నేను చాలా కంగారు పడిపోయాను. నా టెన్షన్ చూసిన విశాఖన్ అర్థం చేసుకున్నాడు. అతనికి చాలా ఓపికెక్కువ వెంటనే విశాఖన్,  వేద్ వచ్చేవరకు తాళి కట్టనని చెప్పేశాడు. విశాఖన్ తండ్రిగా తన భాద్యతను తప్పకుండా నెరవేరుస్తాడని నాకు అర్థమైంది. అంతే కాకుండా తన సంరక్షణలో వేద్ ఆనందంగా ఉంటాడు ” అని చెప్పుకొచ్చింది.

వేద్ తన తండ్రిగా విశాఖన్ ఒప్పుకున్నపుడు కుమారుడి ఆనందాన్ని ఒక వీడియో బందించేసిందట. అయితే ఈవీడియోను మాత్రం ఇపుడప్పుడే వేద్ కి చూపించకుండా.. వేద్ కి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక చూపిస్తానని వ్యక్తం చేశారు.

sondarya with her husband and son