సోనాలీ బింద్రే … ఫోటో షూట్ లో ధైర్యంగా ఆ మచ్చ కనిపించేట్టుగా

0
440
Sonali Bendre shows off her 20-inch scar from cancer surgery
Sonali Bendre shows off her 20-inch scar from cancer surgery

బాలీవుడు నటి సోనాలీ బెంద్రే గత ఏడాది జులైలో మెటాస్టాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె చికిత్స కోసం అమెరికాకు వెళ్ళింది. కనీసం ఎనిమిది నెలలపాటు చికిత్స కొరకు అక్కడే ఉండిపోయిది. ఈ వ్యాధితో పోరాడి ఈ మధ్య భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ క్యాన్సర్ ఉందని తెలిసిన నాటినుండి సోనాలీ తన బాధను ఎప్పటికపుడు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. సోనాలి క్యాన్సర్ తో తాను చేసిన పోరాటాన్ని ప్రతి రోజు తెలుపుతున్న సోనాలి. ఎందుకంటే వ్యాధికి గురైన ఆమెకు అనేక మందికి బలం మరియు ప్రేరణ ఇవ్వాలని కోరుకుంది.

ఇటీవల ఆమె తాజగా తీసుకున్న చిత్రాన్ని అభిమానులతో పంచుకునేందుకు Instagram లో పెట్టింది. వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్న సోనాలి, ఆమె క్యాన్సర్ శస్త్రచికిత్స కొరకు ఆమె పొట్ట భాగంలో 20-అంగుళాల పొడవైన సర్జరీ మచ్చ ను దాచిపెట్టకుండా ఫోటో షూట్ కోసం ప్రదర్శించింది. అయితే ఆమె తన Instagram అకౌంట్ లో ఒక పోస్ట్ ను కూడా చేసి బాధాకరమైన సందేశాన్ని కూడా పెట్టింది.

క్యాన్సర్ చికిత్స తర్వాత తిరిగి వచ్చిన సోనాలీ కొన్ని నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చింది. ఇలా మొదట రావడానికి వెనకాడిన ప్రియా తన్నా .. అనైతా ష్రాఫ్ అదజానియా ఇద్దరు ఫోటో షూట్ కు రావడానికి ఆమె కు ధైర్యాన్నిచ్చారని తెలిపింది. ఎలాంటి మేకప్ వేసుకోకుండా పొడవుగా జుట్టు కూడా మొదటి సరిగా కెమెరా ముందు కు వచ్చి కనిపించడం తనకో కొత్త అనుభవమని చెప్పింది.

ఈ షూట్ తర్వాత మాట్లాడిన సోనాలీ ఒకటి చెప్పింది. మీరు ఎప్పుడు కొత్తగా ఉండడానికి సహజత్వాన్ని కనుక్కోండి’. మీ సహజత్వం మీకు స్వేచ్ఛను ఇస్తుంది. అని చెప్తూ అందరికి సలహా కూడా ఇచ్చింది. నేను చెప్పేది నిజమే మనలో వుండే లోపాలను ఎవరికి కనబడకుండా దాచి పెట్టాలని ఇబ్బంది పడే బదులుగా ‘నా సహజత్వం’ ఇది చెప్పిన తర్వాత ఎవరైనా ఏం అనగలరు. మనకు ఉన్న ధైర్యానికి మంచితనానికి మనది మనమే మనసులో గొప్పలు చెప్పుకొని సలాం కొట్టడం తప్ప. మనం నిజాయితీగా వున్న కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారి విషయం అంటారా. అలాంటి వారి గురించి ఎక్కువగా మాట్లాడకుండా తక్కువ మాట్లాడితే మనకే మంచిది.