ఇక వార‌సుడి వంతు వ‌చ్చేసింది..!

0
149

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిపై ప్ర‌జా క్షేత్రంలో వ్య‌తిరేకత ఉంద‌ని తెలిసినా టీడీపీ మాత్రం ఆయ‌న‌కు త‌గిన గుర్తింపును ఇస్తూ వస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వ‌రుస‌గా నాలుగోసారి ఓడినా టీడీపీ అధిష్టానం మాత్రం ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి వ్య‌వ‌సాయ‌శాఖ‌ను క‌ట్ట‌బెట్టింది. ఇలా పార్టీప‌రంగా అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందుతున్నా ఆయ‌న మాత్రం ప్ర‌జా క్షేత్రంలో విజ‌యం సాధించ‌లేకపోతుండ‌టం గ‌మ‌నార్హం.

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఇలా వ‌రుస ఓట‌ముల‌కు ప్ర‌ధాన కార‌ణం ఆయన మాటతీరేన‌ని, ఆయ‌న మాట తీరుతో కార్య‌క‌ర్త‌ల‌ను, త‌న‌ను న‌మ్మిన వ్య‌క్తుల‌ను సైతం దూరం చేసుకుంటున్నార‌న్న అనుచర‌వ‌ర్గం మాట‌. ఇలా పోటీచేసిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ ఓట‌ములు ఎదుర‌వుతుండ‌టంతో ఇక తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలకు దూరంగా ఉండాల‌ని సోమిరెడ్డి భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

త‌న వారసుడైన సోమిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో బ‌రిలోకి దింపేందుకు తండ్రి చంద్రమోహ‌న్‌రెడ్డి స‌మాయ‌త్తమ‌వ‌డంతోపాటు కుమారుడ్ని ఆ దిశ‌గా సిద్ధం చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఎవ‌రు బ‌రిలో నిలిచినా.. స్థానికంగా టీడీపీకి ఇప్ప‌టికీ బ‌ల‌మైన కేడ‌ర్ ఉంద‌ని, దాంతో టీడీపీకి విజ‌య అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.