సీఎం చంద్ర‌బాబు సంక్రాంతి కానుక‌.. ఎంత పింఛ‌న్ పెంచారో తెలుసా..?

0
112

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న వేళ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. కాగా, రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి జ‌న్మ‌భూమి – మా ఊరు ఆరో విడ‌త కార్య‌క్రమాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లా బోగోలులో నిర్వ‌హించిన జ‌న్మ‌భూమి – మా ఊరు కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌భ‌లో పాల్గొన్న ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వెయ్యి రూపాయ‌లుగా ఉన్న పింఛ‌న్‌ల‌ను రెట్టింపు చేసి రూ.2వేల రూపాయ‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే దివ్యాంగుల‌కు, వితంతువుల‌కు ఇస్తున్న రూ.1,500ల పింఛ‌న్‌ను కూడా వ‌చ్చే నెల నుంచి రెట్టింపు చేసి చెల్లిస్తామ‌ని చెప్పారు.

అంతేకాకుండా, ప్రస్తుతం రాష్ట్రంలో 51 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నామ‌ని, కొత్త‌గా మరో 4 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, అందుకు అనుగుణంగా ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించిన‌ట్లు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛ‌న్ ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దును చెల్లించేందుకు రూ.550 కోట్లను చంద్ర‌బాబు స‌ర్కార్‌ ఖర్చు చేయ‌నుంది.