ఏపీ కొత్త సీఎం కాన్వాయ్ ఫిక్స్

0
96

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని మెజార్టీ సాధించి 151 సీట్లు కైవ‌శం చేసుకున్నారు వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌. 30 వ తేదీన విజ‌య‌వాడ‌లో ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతోన్న జ‌గ‌న్ కు కాన్వాయ్ వెహిక‌ల్స్ రెడీ అవుతున్నాయి.

జ‌గ‌న్ కాన్వాయ్ లో మొత్తం ఆరు వెహిక‌ల్స్ ఉండ‌బోతున్నాయి. ఇవ‌న్నీ టాటా స‌ఫారీ స్ట్రామ్ వాహ‌నాలే. AP 18P 3418 అనే నెంబరుతోనే మొత్తం ఆరు స్ట్రామ్ వెహిక‌ల్స్ ఏపీ కొత్త‌ సీఎం క్వాన్వాయ్ వాహనాలుగా ఉండ‌బోతున్నాయ్‌. వచ్చే వారం నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ కోసం, ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్ ని సిద్ధం చేశారు.

ఇక జగన్ కాన్వాయ్ నిమిత్తం ఓ బులెట్ ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను చేతుల్లోకి తీసుకుంది.