కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్యేలు..?

0
131

తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కోంటోంది. గ‌త ఏడాది చివ‌రాంకంలో జ‌రిగిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ త‌రుపున కేవ‌లం 19 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తెరాస‌ను ఎదుర్కొని మ‌రీ గెలుపొందిన ఎమ్మెల్యేల్లో భరోసా కల్పించడంలో నాయకత్వం విఫలం కావ‌డంతో 19 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడీ న్యూసే తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయింది.

టీఆర్ఎస్‌లో చేర‌నున్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ప్ర‌చారంలో ఉన్న పేర్ల‌ను ప‌రిశీలిస్తే వారిలో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే కోడెం వీరయ్య, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి, ఎల్లారెడ్డి పేట ఎమ్మెల్యే సురేందర్, రేగ కాంతారావ్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరొక టీఆర్ఎస్‌లో చేరుతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇప్పటీకే వీరు ఆరుగురు కూడా మీడియాకు దొరకుండా వారి వారి ఫోన్ల‌ను స్విచ్ ఆఫ్‌ చేసినట్టు తెలుస్తోంది. వీరి బాటలోనే మరికొందరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా మరి కొందరు అయితే ఫోన్ రింగ్ అయినా సమాధానం ఇవ్వకపోవడంతో గాంధీ భవన్ వర్గాల్లో అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. యూరప్‌టూర్‌నుంచి నుంచి తిరిగొచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర‌స్తుత కాంగ్రెస్ ప‌రిణామాల‌పై దృష్టి పెట్టార‌ని తెలుస్తుంది.