ఎన్నికల వేళ వైరలవుతున్న’సింగర్ స్మిత’ వీడియో..!

0
281
daughter of the soil smitha

‘ఇది మన ఇల్లు.. మన భవిష్యత్తు.. ఎవ్వరి సహకారం లేకపోయినా మన స్వయం కృషితో కట్టుకుంటున్న మన ఇల్లు.. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా.. తట్టుకొని చెక్కు చెదరని దీక్షతో పని చేసే.. ఓ నాయకుడి విజన్ మన ఇల్లు.. ఈ ఇల్లు పూర్తి చేయాడానికి కావల్సినది ఓ అనుభవమున్న నాయకుడు.. ఈ ఏప్రిల్ 11వ తేదీన మీరు వేయబోతున్న ఓటు మన భవిష్యత్తు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జై ఆంధ్రప్రదేశ్’ అంటూ సందేశాత్మకమైన వీడియో ను ప్రేక్షకులలోకి వదిలారు. స్మిత ఓటర్ కి అవెర్నేస్ కలిగించే దిశగా తాను చేసిన ఈ ప్రయత్నం సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతుంది.

స్మిత ఇప్పటివరకు ఎన్నో సాంగ్స్ తో అలరించి తన గొంతుతో అందరిని కట్టిపడేసిన ఈ అమ్మడు ప్రస్తుతానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ‘డాటర్ అఫ్ ది సాయిల్’ అనే వీడియో లో స్మిత మాట్లాడిన ప్రతి మాట అందరిని ఆలోచింపచేస్తుంది. చివరగా ‘మన భవిష్యత్తుని తన భాద్యతగా గెలిపించే నాయకుడిని పాలకుడిగా గెలిపించుకుందాం ‘ అని ముగించింది.

విజయవాడకు సంబందించిన సింగర్ స్మితా 1997 సంవత్సరం లో ఈటీవీ ‘పాడుతా తీయగా’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరువాత ‘హాయ్ రబ్బా’ పాటతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించుకుంది. ఎన్నికల వేల విడుదల కాబడిన సందేశాత్మకమైన వీడియోలో స్మిత కూతురు శివి ఆంధ్ర పేరుతో.. నా వయస్సు ఐదేళ్లు అంటూ కీలకమైన పాత్ర పోషించింది.