శృతి హాసన్ రీ ఎంట్రీ…బ్రేక్ కి కారణం ఇదేనట..!

0
265

పవన్ కళ్యాణ్ “కటమరాయుడు” తరువాత అందాలతార శ్రుతి హాసన్ తెరమరుగైది. ఆమె తెరపై కనిపించక దాదాపు రెండేళ్లవుతుంది. దాంతో శృతి పని అయిపోయిందని అందరు భావించారు. అందుకు ప్రదాన కారణం “కటమరాయుడు”లో శృతి హసన్ లుక్, పర్పమేన్స్  చూడడానికి అసహ్యంగా ఉండడమే.. ఈమె అందాల తార శృతి హసనేనా ? అని అందరు ఆశ్చర్యపోయారు.

ఇక ఆ సినిమా తరువాత శృతి కూడా ఎక్కడ కనిపించలేదు. దాంతో ఈ బ్యూటి కెరీర్ క్లోజ్ అని అనేగా పుకార్లు వినిపించాయి. కాని ఈమె బ్రేక్ కి అసలు కారణం అది కాదట. తనకు ఎంతో ఇష్టమైన సంగీతంలో బిజీగా ఉండడంతో, సమయం లేక తనకు తానుగానే సినిమాలకు దూరం అయ్యిందట శృతి.

ప్రస్తుతం సంగీతంలో కొంత ఫ్రీ టైం దొరకడంతో మల్లి హీరోయిన్ అవకాశాల వైపు చూస్తుంది శృతి. అందులో బాగంగానే ప్రస్తుతం తమిళ దర్శకుడు జననాథన్ దర్శకత్వంలో హీరో “విజయ్ సేతుపతి” నటించే చిత్రంలో హీరోయిన్ గా సైన్ చేసేసింది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. ఇదే కాక మన తెలుగు పరిశ్రమలో కుడా ఒక పెద్ద సినిమాకు సైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.