శ్రేయ ఘోషల్ కు అవమానం : భద్రత అంటే ఇదేనా..?

0
147
శ్రేయ ఘోషల్ కు అవమానం : భద్రత అంటే ఇదేనా..?
శ్రేయ ఘోషల్ కు అవమానం : భద్రత అంటే ఇదేనా..?

భారత ప్రముఖ గాయిని “శ్రేయా ఘోషల్‌” కు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చేదు అనుభవం ఎదురైంది. వృత్తిలో బాగంగా ఒక ఈవెంట్ కి హాజరవడానికి సింగపూర్‌ బయలుదేరిన శ్రేయ ఘోషల్ తనతో పాటు ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను తీసుకెళ్లారు. అదిచూసిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఆ పరికరాన్ని విమానంలోకి తీసుకురాకూడదని కండిషన్ పెట్టారు. ఆమె ఎంత గొడవకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో చేసేదిలేక ఆ పరికరాన్ని విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్లారు శ్రేయ.

ఆ అవమానం తట్టుకోలేని ఆమె.. తనకు జరిగిన చేదు అనుభవాన్ని ట్వీట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ మ్యుజిషియన్స్‌ వద్ద విలువైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే విమానం ఎక్కనివ్వదేమో..! మంచిది… ధన్యవాదాలు… నాకు గుణపాఠం చెప్పారు” అంటూ ట్వీట్ చేశారు శ్రేయ. ఇదిలాఉంటే ఆమె ట్వీట్‌ చూసిన ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెంటనే శ్రేయకు క్షమాపణలు చెప్పింది. “శ్రేయా గారు.. మీ పట్ల జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం… అసలేం జరిగిందో.. మా సిబ్బంది మీతో ఏమన్నారో కాస్త వివరంగా చెప్తారా?” అని రీ ట్వీట్ చేసింది సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ.