శర్వానంద్ ‘రణరంగం’ నుంచి ఫస్ట్ లుక్..!

0
76
ranarangam first look

శర్వానంద్ ఇరవై ఏడోవ సినిమా గా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీకి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో ప్రారంభమయ్యే ఈ కథలో శర్వానంద్ గ్యాంగ్ లీడర్ గా కనిపించబోతున్నాడు. సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపుగా చిత్రీకరం చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ మాత్రం ఏంటి అనేది నిన్నటి వరకు తేల్చలేదు. తాజాగా ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

శర్వానంద్ సినిమాకి ‘రణరంగం’ అనే పేరు ను ఖరారు చేస్తూ వదిలిన లుక్ లో మధ్య వయస్సు గల గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ కనిపించాడు. మాస్ హీరో గా శర్వా లుక్ అందరిని అందరిని ఆకర్షిస్తుంది. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రశాంత్ పిళ్లై సంగీతాన్ని అందించగా.. కృష్ణ చైతన్య, రామ్ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై, సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రాన్ని ఆగస్టు 2వ తేదీన రిలీజ్ చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.