పెళ్లి పీటలెక్కపోతున్న ప్రభాస్ హీరోయిన్..! పెళ్లి కొడుకతనే ..!!

0
411
sradda kapoor
shradda kapoor going to marry

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ త్వరలో పెళ్లిపీట లెక్కపోతుంది . గత సంవత్సరమునుండి కంటిన్యూ గా స్టార్ హీరోయిన్ ల పెళ్ళిల్లు జరుగుతున్నాయి. అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ప్రేమ వివాహం చేసుకోగా, ఆ తరువాత దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా ఇలా వారికి నచ్చిన వారిని పెళ్లాడారు. ఈ సంవత్సరముకు గాను మరికొందరు బాలీవుడ్ భామలు వివాహమాడబోతున్నారు. అందులో శ్రద్దాకపూర్, రోహన్ శ్రేష్ట కొన్ని రోజులుగా డేటింగ్ లో ఉన్నారని వార్తలు సంచరిస్తున్న విషయం అందరికి తెలిసిందే.. ఇప్పుడు వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.

కొంతకాలంగా కొన్నిరోజులుగా నటి శ్రద్ధా కపూర్ , ఫొటోగ్రాఫర్‌ రోహన్ శ్రేష్ట డేటింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే శ్రద్ద వయస్సు ముప్పదిరెండు సంవత్సరాలు ఉండటంతో ఇంట్లో వాళ్ళు పెళ్లి కోసం తొందర పెడుతున్నారట. అందుకే రోహన్ విషయాన్ని ఇంట్లో వారితో చెప్పి ఒప్పించిందట. ఇక వీరి పెళ్ళికి కుటుంబము వారు కూడా ఓకే అనడంతో ఈ ఏడాది లేదా  2020లో అతన్ని పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకుంటున్నట్లు వార్తలు బాలీవుడ్ లో మారుమ్రోగుతున్నాయి. శ్రద్ద కపూర్ బాలీవుడ్ ప్రముఖ విలన్, కమెడియన్ శక్తి కపూర్ కూతురు. మరి శ్రద్ధ కపూర్ ఫ్యామిలీ ఒప్పుకున్నారో లేదో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Rohan shresta
shradda kapoor with Rohan shresta

యూవి క్రియేషన్ పతాకం మీద సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సాహో ‘. ఈ చిత్రం లో ప్రభాస్ జోడిగా శ్రద్దా కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. ఈ సినిమాతో పాటు చిచ్చోరే, ఏబీసీడీ 3 లో నటిస్తుంది. సైనా నెహ్వాల్ జీవిత చరిత్ర లో నటిస్తున్న శ్రద్ద ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.