వివాహిత‌కు కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు ఇచ్చి.. ఆపై..!

0
261

అస‌భ్య‌క‌ర ఫోటోలు, వీడియోలు తీసి వేధింపుల‌కు పాల్ప‌డుతున్న కామాంధుడికి అక్కా, చెల్లెళ్లు బుద్ధి చెప్పారు. అంత‌టితో ఆగ‌క త‌ర‌చూ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్న అత‌డ్ని చిత‌క్కొట్టి మ‌రీ పోలీసుల‌కు అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

కాగా, కొద్ది రోజుల క్రితం నిర్మ‌ల్‌కు చెందిన అనీల్‌కుమార్ అనే యువ‌కుడు నిజామాబాద్‌కు చెంద‌ని ఒక వివాహిత‌కు కూల్‌డ్రింక్‌లో మ‌త్తుమందు క‌లిపి ఇచ్చాడు. వివాహిత స్పృహ కోల్పోవ‌డంతో, ఆమెతో క‌లిసి అస‌భ్య‌క‌రంగా ఫోటోలు, వీడియోలు తీశాడు. ఇక అప్ప‌ట్నుంచి అస‌భ్య‌క‌ర ఫోటోలు, వీడియోలు చూపిస్తూ వివాహిత‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డుతూ అనీల్ లైంగికంగా వేధించేవాడు.

ఓ రోజు వివాహిత ఫోటోలను ఆమె భ‌ర్త‌కు పంపాడు. దీంతో భార్య‌ను అనుమానించిన భ‌ర్త ఆమెను ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపేశాడు. మ‌రోసారి నిజామాబాద్‌కు వ‌చ్చిన అనీల్ త‌న వెంట రావాలంటూ వివాహిత‌ను బ‌ల‌వంతం చేశాడు. దీంతో వివాహిత‌, ఆమె చెల్లులు ఇంటిప‌క్క‌నే ఉన్న అనీల్‌ను చిత‌క్కొట్టి పోలీసు స్టేష‌న్‌లో అప్ప‌గించారు.