మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం – వెంటాడి మ‌రీ..!

0
178

గుంటూరు జిల్లాలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణం జ‌రిగింది. ఓ మ‌హిళ త‌న‌తోపాటు వేరొక వ్య‌క్తితో అక్ర‌మ సంబంధం కొన‌సాగిస్తుంద‌న్న అనుమానంతో ఓ వ్యక్తి హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సంఘ‌ట‌న‌కు సంబంధించి రేప‌ల్లె మండ‌లం పోలీసు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ప‌టేరు గ్రామానికి చెందిన డొక్కు నిర్మ‌ల అనే మ‌హిళ భ‌ర్త రెండేళ్ల క్రిత‌మే అనారోగ్య స‌మ‌స్య‌తో మృతి చెందాడ‌ని, అప్ప‌ట్నుంచి ఆమె అదే గ్రామానికి చెందిన శ్రీ‌నివాస‌రావుతో అక్ర‌మ సంబంధం నెరుపుతుంద‌న్న విష‌మం త‌మ విచార‌ణ‌లో వెల్లడైంద‌ని పోలీసులు తెలిపారు.

అయితే, బుధ‌వారం నాడు కూర‌గాయ‌లు కొనుగోలు చేసేందుకు వ‌చ్చి, పంచాయ‌తీ కార్యాల‌యం ముందు నిల‌బ‌డి ఉన్న నిర్మ‌ల‌పై శ్రీ‌నివాస‌రావు క‌త్తితో దాడిచేసేందుకు వ‌చ్చాడ‌ని, శ్రీ‌నివాస‌రావు రాక‌ను గ‌మ‌నించిన నిర్మ‌ల అక్క‌డి నుంచి ప‌రుగులు పెట్టింద‌ని స్థానికుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

భ‌యంతో ప‌రుగులుపెట్టిన నిర్మ‌లను ప‌ట్టుకున్న శ్రీ‌నివాస‌రావు మెడ‌పై క‌త్తితో న‌ర‌క‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావంతో అమె ఆక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన‌ట్టు స్థానికులు చెప్పారు. నిర్మ‌ల‌ను హ‌త్య చేసిన శ్రీ‌నివాస‌రావును తాము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామ‌ని, అస‌లు నిజా నిజాలు త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డ‌వుతాయ‌ని పోలీసులు చెబుతున్నారు.