ఎంత మంది న‌న్ను వాడుకున్నా.. నా మ‌న‌సు గెలిచింది మాత్రం అత‌నే : ష‌కీల

0
561

నా జీవితంలో ప్రేమ పేరుతో లొంగ‌దీసుకుని మోసం చేసి వారు చాలా మందే ఉన్నారు. కానీ ఒక్క వ్య‌క్తి మాత్రం అందుకు భిన్నం. ఒకే ఒక్క సంఘ‌ట‌న‌తో నా ప్రేమ‌ను గెలుచుకున్నాడు. అత‌ని మంచి మ‌న‌సును చూసి అత‌నికి ల‌వ్ ప్రపోస్ కూడా చేశా. కానీ అత‌ని నుంచి నిరాక‌ర‌ణ ఎదురైందంటూ ష‌కీలా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా, ష‌కీలా జీవితం ఆధారంగా ష‌కీల నాట్ ఏ పోర్న్ స్టార్ టైటిల్‌తో బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మీడియా ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ష‌కీలా త‌న జీవితంలోని ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పింది.

అది 2007. అంటూ మొద‌లు పెట్టిన ష‌కీల‌, తాను న‌టించిన చిత్రం చోటా ముంబ‌యి చిత్రీక‌ర‌ణ‌లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను తెలిపింది. చిత్రానికి సంబంధించి న‌టీన‌టుల ఎంపిక జ‌రిగిన రెండు రోజుల త‌రువాత షూటింగ్ ప్రారంభ‌మైంది. ఆ స‌మ‌యంలోనే త‌న అమ్మ‌గారికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించాల్సి వ‌చ్చింద‌ని, చేతిలో డ‌బ్బులు కూడా లేని ప‌రిస్థితి. ఆ విష‌యం తెలిసిన చిత్రం నిర్మాత మ‌ణ్యం పిల్ల రాజు స్పందించి వెంట‌నే సినిమా పూర్తి కాక ముందే త‌న రెమ్యున‌రేష‌న్ మొత్తాన్ని చెల్లించాడ‌ని, అడ‌క్కుండానే నిర్మిత ఇచ్చిన‌ డ‌బ్బుతో త‌న త‌ల్లిని బ‌తికించుకోగ‌లిగానంటూ తెలిపింది.

నిర్మాత మ‌ణ్యం పిల్ల రాజు చూపిన ద‌యాగుణం, స్పందించిన తీరును చూసి ఫిదా అయ్యాయ‌ని, దానిత‌పాటు అత‌నిపై ప్రేమ పుట్టింద‌ని తెలిపింది. త‌న జీవితంలో మొట్ట మొద‌టిసారి అత‌నికి ప్రేమ లేఖ రాశాన‌ని, అందుకు అత‌ని నుంచి ఎటువంటి స్పంద‌న రాలేద‌ని తెలిపింది. ఆ విష‌యం త‌న‌ను బాధించినా చివ‌ర‌కు అత‌న్ని మరిచిపోయేందుకు ప్ర‌య‌త్నించాన‌ని, క‌నీసం అడ్వాంటేజ్ తీసుకోక‌పోవ‌డంతో అంత‌కు ముందుక‌న్నా ఎక్కువ న‌చ్చిన‌ట్టు తెలిపింది.