ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై అత్యాచారం..!

0
1201

ప్ర‌కాశం జిల్లా కారంచేడు శివారులో ప్రేమికులపై క‌న్నేసిన దుండ‌గులు వారిపై దాడి చేశారు. ప్రియుడి క‌ళ్లెదుటే యువ‌తిపై గ్యాంగ్ అత్యాచారానికి పాల్ప‌డ్డారు. యువ‌తి ద‌గ్గ‌రున్న న‌గ‌దు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ఎలాగోలా గ్యాంగ్ నుంచి త‌ప్పించుకున్న బాధితులు కారంచేడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం చీరాల ఆస్ప‌త్రికి త‌ర‌లించిట్టు పోలీసులు తెలిపారు. త్వ‌ర‌లోనే నిందితుల‌ను ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని చీరాల రూర‌ల్ సీఐ శ్రీ‌నివాస‌రావు తెలిపారు.

మేడ్చ‌ల్‌లో..

మేడ్చ‌ల్ మైన‌ర్ బాలిక హ‌త్య కేసులో పోలీసులు మిస్ట‌రీని చేదించారు. క‌న్న‌తండ్రే ఈ హ‌త్య చేశాడ‌ని పోలీసులు ప్రాధ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. తండ్రి సుబ్ర‌హ్మ‌ణ్యమే త‌న కుమార్తెను అత్యాచారం చేసి అనంత‌రం గొంతుకోసి హ‌త్య‌చేసిన‌ట్టు పోలీసులు కీల‌క ఆధారాలను సేక‌రించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మృతురాలు నిందితుడి మొద‌టి భార్య కుమార్తెగా గుర్తించారు.