అవును, మీరు చదివింది అక్షరాల సత్యం. అందరూ చూస్తుండగా ఆరుబయట ఏర్పాటు చేసిన పడకపై శృంగారంలో పాల్గొన్నారు. అందులో మహిళ కాస్త ఎక్కువ ఉద్వేగానికి గురవడంతో గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమై వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదంటూ బాధితురాలి కుటుంబ సభ్యులకు అభయమిచ్చారు. ఆమె వయస్సు 52 సంవత్సరాలు. ఇంతకీ ఆరుబయట శోభనమేంటి..? ఏ దేశంలో..? అన్నదేగా మీ డౌట్.
ఇక అసలు విషయానికొస్తే, స్వింగ్ ఫీల్డ్స్ అనే సంస్థ యూకే వోర్సెస్టర్షైర్ పరిధిలోని మల్వేర్న్లో ‘అరోరా ఫెస్టివల్’ పేరుతో శృంగారం పండుగను నిర్వహిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ పండుగకు ప్రతి ఏడాది పార్ట్నర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. మల్వేర్న్కు ఆనుకుని ఉన్న సుదూర గ్రామం పంటపొలాల్లో నిర్వహించిన ఈ శృంగారం పండుగలో ఈ ఏడాది కూడా 700 జంటలు పాల్గొన్నాయని స్వింగ్ ఫీల్డ్స్ సంస్థ తెలిపింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన ఈ పండుగ ఆదివారంతో ముగిసింది.