అభినందన్ రాక.. లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

0
140
అభినందన్ రాక.. లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌
అభినందన్ రాక.. లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

గత మూడు రోజులగా వరుస నష్టాల్లో ఉన్న దేశీయ సూచీలు, అభినందన్ రాకతో కోలుకుని వారాంతాన్ని లాభాలతో ముగించాయి. పాక్ అదుపులో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ “అభినందన్‌”ను విడుదల చేస్తామని ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొంత తగ్గుముఖం పట్టాయి.. ఇమ్రాన్ ప్రకటన మార్కెట్‌కు కలిసొచ్చింది. దాంతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అద్యంతం అదే జోరును కొనసాగించాయి.

ఈరోజు ఉదయం 200 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల అండతో ఒక్కసారిగా దూసుకెళ్లింది. మరీ ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల్లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 196 పాయింట్లు లాభపడి 36,064 వద్ద ముగిసింది. ఇక అటు నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10,863.50 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.80 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో హిందుస్థాన్‌ పెట్రోలియం, జీ ఎంటర్‌టైన్‌ మెంట్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌ఎసీ, ఐఓసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి. ఇదిలాఉంటే బజాజ్‌ ఆటో, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.