అభివృద్ధిని చూసి ఓట్లేయండి : చ‌ంద్ర‌బాబు

0
157

ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ త‌మ ప్రాంతాల్లో జ‌రిగిన అభివృద్ధిని చూసి ఓట్లేయాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు. కాగా, ఏపీ అభివృద్ధిపై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు వివ‌ర‌ణ‌గా సీఎం చంద్ర‌బాబు చివ‌రి శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ కొత్త రాష్ట్ర‌లో ఆర్థిక వ‌న‌రులు లేక ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న.. సామాన్యుల‌కు సంక్షేమ ఫ‌లాల‌ను అందించామ‌న్నారు.

సుప‌రిపాల‌న అంటే ఏంటో తెలియ‌నివారు మాయ‌మాట‌లు చెప్పి ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నార‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిక్షాల‌నుద్దేశించి అన్నారు. త‌మ త‌మ గ్రామాల్లో ఏఏ ప‌నులు జ‌రిగాయో చూసుకుని ప్ర‌జ‌లు ఓట్లేయాల‌ని పిలుపునిచ్చారు. హైద‌రాబాద్‌లా అమ‌రావ‌తి త‌యారు కావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, మ‌రో ప‌క్క ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటులో అన్ని రాష్ట్రాల‌కంటే ఏపీ ముందువ‌రుస‌లో దూసుకుపోతుంద‌న్నారు.