ఝాన్సీతో విడిపోవడానికి కారణం అదే..

0
204

జోగి బ్రద‌ర్స్ లో ఒక‌రుగా, ప్రముఖ యాంకర్ ఝాన్సీ మాజీ భ‌ర్తగా జోగినాయుడు అంద‌రికీ సుప‌రిచిత‌మే. తాజాగా జోగినాయుడు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకుని అనంతరం 8ఏళ్ల త‌ర్వాత‌ ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చిందో ఆయ‌న చెప్పుకొచ్చారు.

“సరదాలు, విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్లే జీవితాలు నాశమవుతాయని.. అలాంటి అంశాల కారణంగానే తమ మధ్య కూడా గొడవలు మొదలయ్యాయని జోగి తెలిపాడు. ఝాన్సీ తన నుంచి విడిపోవడానికి ఆర్థిక పరమైన విషయాలే కారణమన్నారు. ఆమె కోసం తాను 8 ఏళ్లపాటు ఎదురు చూసి ఆ తరువాతే మరో వివాహం చేసుకున్నానని జోగినాయుడు స్ప‌ష్టం చేశారు.

త‌మ‌త‌మ‌ కెరీర్ ఆరంభంలో జోగి-ఝాన్సీ వివాహం చేసుకున్నారు. అయితే ఝాన్సీ కెరీర్ అప్రతిహతంగా కొనసాగగా.. జోగినాయుడు మాత్రం కొంత డౌన్ ఫాల్‌ను చవిచూశాడు. అయితే ఝాన్సీని జోగినాయుడు వేధించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిపై జోగినాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తాను ఝాన్సీని వేధించానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు.