యాక్టింగ్ మానేస్తాన‌ని చెప్పా : సందీప్ కిష‌న్

0
163

తాను న‌టించే ప్ర‌తి ఒక్క సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాల‌నే చేస్తాన‌ని, అందులోనే త‌న‌కు సంతోషం ఉంటుందని హీరో సందీప్ కిషన్ అన్నారు. కాగా, సందీప్ కిష‌న్ హీరోగా, అన్యా సింగ్ హీరోయిన్‌గా కార్తీక్ రాజు తెరకెక్కించిన నిను వీడ‌ని నీడ‌ను నేనే చిత్రం శుక్ర‌వారం విడుద‌లై ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా సందీప్ కిష‌న్ మాట్లాడుతూ నిను వీడ‌ని నీడ‌ను నేనే చిత్రానికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని, ఈ చిత్రానికి చేసిన హార్డ్‌వ‌ర్క్ గ‌త చిత్రాల‌కూ చేశాన‌న్నారు. ఆ క్ర‌మంలోనే త‌న‌కు త‌ల‌పై, కంటికింద‌, చేతిపై ఇలా త‌న శ‌రీరంలో ప‌లుచోట్ల గాయాల‌య్యాయ‌న్నారు.

ఈ చిత్రానికి సంబంధింఇ త‌మిళ్ ప్రెస్‌మీట్‌లో తాను ఛాలెంజ్ చేశాన‌ని, సినిమా చూసి బ‌య‌ట‌కొచ్చిన ఏ ఒక్క‌రైనా మా చిత్రం రెగ్యుల‌ర్ హార్ర‌ర్ అని చెప్తే యాక్టింగ్‌ మానేస్తానంటూ చేసిన ఛాలెంజ్‌ను సందీప్ కిషన్ గుర్తు చేశారు.