తల్లికావడం పై సమంత స్పందన..! ఫాన్స్ షాకింగ్..!!

0
496
Samantha
Samantha reacted on Being a mother

నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మజిలీ ‘. అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తరవాత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకులను అలరించబోతుంది. వీరిద్దరి పెళ్లి తర్వాత రాబోతున్న మొదటి చిత్రం కావడం తో భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఆ అంచనాలకు తగినట్టుగానే మజిలీ ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో సమంత తల్లి కావడం పై ప్రశ్న తలెత్తింది. దీనిపై సామ్, చైతూ స్పందించారు.

అక్కినేని సమంత, నాగచైతన్య ఇద్దరు సుమారు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత గోవాలో 2017వ సంవత్సరం అక్టోబర్‌ నెలలో వివాహబంధంతో ఏకమయ్యారు. అందమైన జంటగా గుర్తింపు సాదించారు. వివాహం ముందు వరకు గ్లామర్ పాత్రలు పోషించిన అమ్మడు వివాహం తరవాత కొంతవరకు గ్లామర్ రోల్ సినిమాలకు దూరంగానే ఉంది. రంగస్థలం తో రీఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మహానటి, అభిమన్యుడు, యూ టర్న్ లాంటి చిత్రాలలో చాలా ప్రత్యేకమైన పద్దతిలో దర్శనమిచ్చింది.

 Akkineni samantha
Akkineni samantha .. nagachaithanya

గత సంవత్సరం సమంతను తల్లి కాబోయే విషయమై ఓ ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా ‘నాకు ఏ సమయానికి పాపాయి కావాలో చై.. నేను నిర్ణయించుకున్నాము. దాని కోసం టైం, డేట్ కూడా ఫిక్స్ అయ్యాము. చైతూ ఇష్టపడే ఆ తేదీనే బిడ్డ పుట్టాలని ఆయన అనుకుంటున్నారు’ అని అప్పుడు చెప్పింది. ఇప్పుడు కూడా మజిలీ ప్రచారం చేస్తున్న ఈ యంగ్ కపుల్స్ కి తిరిగి అదే ప్రశ్న ఎదురవ్వగా.. సమంత స్పందించింది.

సమంత మాటల్లో.. ‘నేను నా చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులను చవిచూశాను.. అదే పరిస్థితి నా బిడ్డకు రాకూడదని నేను భావిస్తున్నాను. నేను గనక తల్లిని అయితే… నటనకు విరామము ఇస్తాను. పూర్తిగా తల్లి ప్రేమను నా బిడ్డకు పంచుతాను. నా బిడ్డే నా ప్రపంచముగా ఆనందంగా గడుపుతాను. తల్లి తనములోనున్న గొప్ప తనాన్ని నేను అనుభవిస్తాను. అందుకే పాపాయి పుడితే నటనను దూరం పెడతాను’ అని సామ్ చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడు తల్లి కావాలనుకుంటున్నారు? నాగ్, సామ్ ఖరారైనా ఆ తేదీని చెప్పలేదు. ఆ ప్లానింగ్ తేదీ ఈ మధ్య కాలంలోనే ఉందా అనే విషయం మాత్రం ప్రస్తావించలేదు.