వామ్మో.. సమంత ఇలా చేస్తుందా..!

0
274
samantha acting in manmadhudu2

కింగ్ నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు2′ ఈ చిత్రాన్ని మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై అక్కినెని నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం లో సమంత ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.

ఆ మధ్య జరిగిన ‘పోర్చుగల్’ షూటింగ్ లో అక్కినేని కోడలు జాయిన్ అయ్యింది. షూటింగ్ ముగించుకొని అటు నుంచి అటే నాగ్ తో కలిసి మజిలీ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి పారిస్ వెళ్ళింది. ‘మన్మథుడు 2’ లో సమంత పాత్ర ఏంటి? ప్రధానమైన పాత్ర అంటే ఏమై ఉంటుంది? అని ఫ్యాన్స్ కి ప్రశ్నల మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాగార్జున ‘మన్మథుడు’ చిత్రం లో అమ్మాయిలకు దూరమగా అంటాడు. దీనికి గల కారణాలేంటి? ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటాడని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తాడు తనికెళ్ల భరణి. అయితే ఇప్పుడు ‘మన్మథుడు 2’ లోమరీ రొమాంటిక్ హీరోగా కనిపించబోతున్నాడట. అమ్మాయిలకు మరి చనువుగా ఉంటాడట. అయితే ఇలా అమ్మాయిలకు ఎందుకు ఇంతగా దగ్గరగా ఉంటాడు? దీని వెనకున్న కారణమేంటి?  అని, సమంత ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లే పాత్రలో ఆమె నటిస్తుందని తాజా సమాచారం.